UP Shocker: వీడియో ఇదిగో.. బాలుడి ప్రైవేట్ పార్టును పట్టుకుంటూ రాపిడో రైడర్ లైంగిక వేధింపులు.. మైనర్ ఫిర్యాదుపై సంస్థ స్పందన ఏంటంటే..
UP Shocker: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాపిడో (Rapido) బైక్ బుక్ చేసుకుని ప్రయాణించిన ఒక 17 ఏళ్ల బాలుడిని బైక్ రైడర్ లైంగికంగా వేధించాడు. బైక్ కదులుతుండగానే వెనుక ఉన్న బాలుడి కాలు, తొడలను తాకుతూ, ప్రైవేట్ భాగాలను పట్టుకునేందుకు యత్నించాడు. ఆ బాలుడు వెంటనే అప్రమత్తమై రైడర్ చర్యలను అడ్డుకోవడమే కాకుండా, తన మొబైల్ ఫోన్‌లో రైడర్ చేస్తున్న లైంగిక వేధింపులను వీడియో రికార్డ్ చేశాడు.
అనంతరం తాను ఒక మైనర్ అని పేర్కొంటూ.. రికార్డ్ చేసిన వీడియో ఆధారంతో రాపిడో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో రైడర్ వికృత చేష్టలపై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన రాపిడో సంస్థ.. బాధితుడి బుకింగ్ వివరాలు, రైడర్ ఐడీని సేకరించింది. ఆ రైడర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అతడిని తమ ప్లాట్‌ఫారమ్ నుంచి శాశ్వతంగా నిషేధించినట్లు బాధితుడికి సమాచారం అందించింది. జరిగిన దానికి క్షమాపణలు తెలుపగా.. తన ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించినందుకు ఆ బాలుడు రాపిడో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.
Rapido Rider Accused of Sexual Harassment by Teen
Minor Boy Gets Harassed by Rapido Driver During Ride & Posts About It in a Peculiar Gen-Z Way pic.twitter.com/sfyihrXNdS
— Grey Insights (@GI_Bharat) August 14, 2026
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 2026 09:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

