Vjy, Jan 7: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. వీటితో పాటు 3,900 ప్రత్యేక బస్సులనూ (Special Buses) నడపనున్నట్లు తెలిపింది.
ఈ సర్వీసులు జనవరి 8 నుంచి 13 వరకూ అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి 300 బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153, అలాగే బెంగళూరు నుంచి 375 బస్సులను ప్రయాణికుల కోసం నడపాలని నిర్ణయించింది.
శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి! స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం
ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపిన ఆర్టీసీ రెండు వైపులా ప్రయాణాలకు సంబంధించి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇక పండగ తర్వాత తిరిగి వెళ్లేందుకు ఈనెల 16 నుంచి 20 వరకూ 3,200 ప్రత్యేక బస్సులనూ నడపనున్నట్లు తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం వివిధ ప్రాంతాలకు 6,432 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.