Srishailam, JAN 04: శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు దేవస్థానం (Srisailam Temple) కీలక నిర్ణయం తీసుకున్నది. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనంలో (Sparsha Darshanam) మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీశైలమహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతోనూ, సర్వ దర్శనం క్యూలైన్‌లోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి (Sparsha Darshanam) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. రద్దీ రోజుల్లో ఉదయం 7.30 గంటలకు, రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Astrology: జనవరి 6న శని సూర్యగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
ఇతర సమయమంతా కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని తెలిపారు. గతంలో అమలులో ఉన్న మధ్యాహ్న కాలపు స్పర్శ దర్శనం రద్దీ రోజుల్లో పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఒక్కొక్క విడతలో కేవలం 500 టికెట్లు మాత్రమే జారీ చేస్తామని వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో రూ.1,000 సేవా రుసుముతో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. కనుక భక్తులు ఈ మార్పులు గమనించాలని కోరారు.