జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సూర్య గ్రహాలు ప్రధాన గ్రహాలలో ముఖ్యమైనవి. ఇవి అని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాయి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం జనవరి 6వ తేదీన ఉదయం 4 గంటలకు శని సూర్య గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో కలుసుకుంటాయి. దీని ద్వారా ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఏర్పడుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి సూర్యుడు శని గ్రహాల కలయిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. విజయానికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టబడ్డలు పెట్టాలనుకునే నెరవేరుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి శని సూర్యుడు గ్రహాల కలయిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం కి ఇది మంచి సమయం పనిలో పెరుగుదల ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ పర్యటనలకు వెళతారు. జీవితంలో సుఖం, ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళతారు.
మేష రాశి- మేష రాశి వారికి శ శని సూర్యుని కలయిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రవర్తనతో ప్రజలను ఆకర్షిస్తారు . బయటపడతారు. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకున్న నూతన వాహనం కల నెరవేరుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కెరీర్లో ముందుకు వెళతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణంలో అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కల నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.