America is treating youth cruelly in the name of illegal immigrants says CPI Narayana(X)

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ . ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న సంగతి తెలిసిందే(CPI Narayana On Illegal Immigrants). ఇప్పటికే పలు దఫాల్లో భారతీయులు వెనక్కి రాగా దీనిపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్ చేశారు.

అక్రమ వలసదారుల పేరుతో యువత పట్ల అమెరికా క్రూరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ నారాయణ(CPI Narayana). అమెరికా పార్లమెంటు ముందు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ట్రంప్ అధికారంలోకి రాగానే వలసదారులను(Illegal Immigrants) జంతువుల తరహాలో ట్రీట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంతువుల్ని వేటాడినట్టుగా, క్రిమినల్స్ ను వేటాడినట్లుగా వేటాడు తుంది... ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మనం సపోర్ట్ చేయడం లేదు కానీ మోడీ వచ్చినప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ ఉంటే చెప్పండి తీసుకెళ్తం అని కనీసం ట్రంప్ కి చెప్పలేకపోయారు అన్నారు.

అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్ 

ట్రంప్ మోడీ ఇద్దరు కలిసినప్పుడు కూడా ఈ విషయంపై మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను వేటాడే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. వాళ్లకు కావాల్సిన ప్రాసెస్ చేసుకొని పంపించాలి కానీ వేటాడడం ఎందుకు.. యువకులు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది, ఈ విధంగా అమెరికా ప్రభుత్వం చేయడం అనేది చాలా దారుణం అన్నారు.

America is treating youth cruelly in the name of illegal immigrants says CPI Narayana

ఇక అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి పలు దేశాలు. భారత్‌కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంకెళ్లు వేసింది అమెరికా మిలిటరీ. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వారిని అవమానించడమేనని కామెంట్ చేస్తున్నారు.