
Hyderabad, Feb 23: ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో (Pawan Kalyan At Apollo Hospital) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అపోలో వైద్య సిబ్బంది పవన్ కు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పవన్ కు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నెలాఖరున గానీ, మార్చి మొదటి వారంలో గానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకన్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
అపోలో ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు స్కానింగ్‌తో పాటు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. pic.twitter.com/PSLpkY9G82
— ChotaNews App (@ChotaNewsApp) February 23, 2025
కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత..
పవన్ కళ్యాణ్ మూడు రోజుల కిందట కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగరాజ్ లో సతీమణి అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్ తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత పవన్ హాస్పిటల్ లో హెల్త్ చెక్ అప్ చేయించుకోవడంపై తొలుత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, సాధారణ చెక్ అప్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.