కర్నూలు, అక్టోబ్ 3: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు గాడి తప్పి విద్యార్థితో గే సెక్స్ కు బానిస అయ్యాడు. ఆ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు బాలుడి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని ఉప్పల పాడు గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో గత నాలుగేళ్లుగా రాంబాబు అనే వ్యక్తి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో అతను చనువు పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఉయ్యాలవాడ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
అక్కడికి వెళ్లిన ఈ టీచర్ లైగింక వేధింపులకు గురిచేస్తుండటంతో విద్యార్థి భరించలేక తల్లిదండ్రులకు తెలియచేశాడు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. తప్పు ఒప్పుకోకపోవడంతో దేహశుద్ధి చేసిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.