Pan Am wreckage: 73 ఏళ్ల మిస్టరీ వీడింది.. 1952 పాన్ యామ్ విమాన ప్రమాద మిస్టరీకి ముగింపు.. అట్లాంటిక్ మహసముద్రంలో శకలాల వెలికితీత..
74 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన పాన్ యామ్ (Pan Am) విమాన శకలాలను ఎట్టకేలకు.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. 1952లో 69 మంది ప్రయాణికులతో ప్యూర్టో రికో తీరంలో ఈ విమానం సముద్రంలో కూలిపోయింది.
Pan Am wreckage: 74 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన పాన్ యామ్ (Pan Am) విమాన శకలాలను ఎట్టకేలకు.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. 1952లో 69 మంది ప్రయాణికులతో ప్యూర్టో రికో తీరంలో ఈ విమానం సముద్రంలో కూలిపోయింది.
అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 2 వేల అడుగుల లోతున, విమానం రెండు పెద్ద భాగాలుగా చీలిపోయి ఉన్నట్లు జూన్ 2న తాము కనుగొన్నామని సదరు సంస్థ మంగళవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అధునాతన హై-రిజల్యూషన్ సోనార్, అటానమస్ అండర్‌వాటర్ వాహనాల సహాయంతో ఈ చారిత్రక శకలాలను వెలికితీశారు. గతంలో డిస్కవరీ ఛానెల్‌కు చెందిన ఎక్స్‌పెడిషన్ అన్‌నోన్, డీప్ సీ విజన్ సంస్థలు కూడా ఈ విమాన ఆచూకీ కోసం ఏళ్ల తరబడి తీవ్రంగా శ్రమించాయి.
క్లిప్పర్ ఎండీవర్ అని పిలిచే ఈ విమానం న్యూయార్క్ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ అట్లాంటిక్ సముద్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ల్యాండింగ్ సమయానికి ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. ఆ తర్వాత ప్రయాణికులను రక్షించే ప్రక్రియలో సరైన సమన్వయం లేకపోవడం, సమాచార లోపం, భాషా సమస్యల వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. సముద్రంలోకి విమానం దిగిన కేవలం మూడు నిమిషాల్లోనే నీరు చేరి మునిగిపోవడంతో ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
డైనోసార్లను నాశనం చేసిన అరుదైన గ్రహశకలం గుర్తింపు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
ప్రస్తుతం మనం విమాన ప్రయాణాల్లో చూస్తున్న అనేక కఠినమైన భద్రతా ప్రమాణాలకు ఈ విషాదకర సంఘటనే పునాది రాయిగా నిలిచింది. విమానం టేకాఫ్ కాకముందు ఫ్లైట్ అటెండెంట్లు ప్రయాణికులకు ఇచ్చే ప్రాథమిక సేఫ్టీ బ్రీఫింగ్స్, అత్యవసర నిబంధనలు ఈ ప్రమాదం తర్వాతే అమలులోకి వచ్చాయి. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డు ఈ లైఫ్ సేవింగ్ ప్రోటోకాల్‌ను ప్రతి ప్రయాణంలోనూ తప్పనిసరి చేస్తూ అప్పట్లోనే కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ చారిత్రక అన్వేషణ వెనుక ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రస్ మాథ్యూస్ కృషి ఎంతో ఉంది. పాత ప్రమాద నివేదికలను క్షుణ్ణంగా పరిశోధించిన ఆయన 2019లో శాన్ జువాన్ తీరంలో విస్తృత సర్వేలు చేపట్టారు. ఎక్స్‌పెడిషన్ అన్‌నోన్ బృందంతో కలిసి ముందుకు సాగుతూ.. అమెరికా ఎయిర్‌ఫోర్స్ పైలట్లు గతంలో తయారు చేసిన పాత మ్యాప్‌ల ఆధారంగా పరిశోధన కొనసాగించారు. రీసెర్చ్ వెసెల్ ద్వారా అండర్‌వాటర్ డ్రోన్‌ను పంపి మొదటి ప్రయత్నంలోనే విమాన శకలాలను కనుగొనగలిగారు. సోనార్, డ్రోన్ తీసిన ఫొటోలలో విమానంపై ఉన్న పాన్ అమెరికన్ లోగోతో పాటు దాని పేరు స్పష్టంగా దర్శనమిచ్చాయి.
(The above story first appeared on LatestLY on Jul 22, 2026 06:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

