CM YS Jagan Kurnool And Nandyal Tour Live Updates: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటన కొనసాగుతోంది.హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ను ప్రారంభించారు సీఎం జగన్. దీని ద్వారా డోన్, పత్తికొండ,ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ రానుంది.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు,సాగునీటి సరఫరా అందనుంది. 10,394 ఎకరాలకు సాగునీరందించే పథకం ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి. రూ.224 కోట్లతో పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. 77 చెరువులకు లక్కసాగరం పంప్‌హౌస్ నీటిని అందించనుంది. దీంతో, నీటి కష్టాలు తీరునున్నాయి.
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన
అనంతరం డోన్ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రసంగించారు.రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు.
అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం..
నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం.
మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి..
గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి.
డోన్ సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్
►ఇప్పుడు మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా
►అప్పుడు ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్
►కానీ చంద్రబాబు మాత్రం చేయడు.. చేయాలనే మనసేరాదు
►చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ ఉండదు
►చంద్రబాబు మంచిని చేయడం ఎప్పుడూ నమ్ముకోలేదు
►ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ-5లను నమ్ముకున్నాడు
►వీటికి తోడు దత్తపుత్రుడితో ఎండ్ చేస్తాడు బాబు.
►ఏమీ చేయకపోయినా ఇవి చంద్రబాబు డబ్బు కొడతాయి
►ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని
►హంద్రీనీవాను దివంగత నేత వైఎస్సార్ పూర్తి చేశారు.
►అధికారంలోకి రాగానే రాయలసీమకు లిఫ్ట్ పనులు
►వెలుగొండ ప్రాజెక్టును వడివడిగా పూర్తి చేస్తున్నాం
►రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం
►ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది►రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు
►ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు
►గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ఇరిగేషన్‌లో లేదు
►గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదు
►ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు
►ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుంది
►రూ. 253 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేశాం
►నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది
►అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల పూర్తికి చర్యలు