ఏపీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటన ముగిసింది. తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.అంతకుముందు తిరుపతిలో సీఎం జగన్ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లను కూడా ప్రారంభించారు.

ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, పెద్దిరెడ్డి, రోజా, ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు ఉన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.

Here's YSR Congress Party Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)