తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖులు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో హీరోయిన్ హన్సిక మోత్వాని(Actress Hansika Motwani), తెలంగాణ మాజీ మంత్రి జానారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Jana Reddy ), జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి,తెలంగాణ ఎమ్మెల్సీ దయానంద్,ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

వేర్వేరుగా వీరంతా వీఐపీ బ్రేక్ విరామం సమయంలో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు.

నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

ఇక మరో వార్తను చూస్తే నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు . ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.  పోసానికి ఖైదీ నంబర్ 2261 కేటాయించారు జైలు అధికారులు. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.

Actress Hansika Motwani and Former Telangana Minister Jana Reddy visits Tirumala

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)