నటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.  పోసానికి ఖైదీ నంబర్ 2261 కేటాయించారు జైలు అధికారులు.

పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోరగా దీనిని న్యాయవాది తిరస్కరించారు. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.

నేడే పూర్తిస్థాయి బ‌డ్జెట్.. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ సర్కారు.. సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో రాష్ట్ర బ‌డ్జెట్

జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న ఫిర్యాదు చేయగా 196,353(2).111 రెడ్‌ విత్ 3() సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 26ప పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Railway Koduru Court Remands Posani krishnamurali for 14 Days

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)