ప్రముఖ నటుడు,వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణమురళికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. ఇక్కడ నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని తరుఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి కాస్తా ఊరట లభించినట్లైంది.
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి
గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
Kadap Court Grants Bail to Posani Krishna Murali
పోసాని కృష్ణమురళికి బెయిల్#PosaniKrishnaMurali #Bail #Court #AndhraPradesh #SakshiNewshttps://t.co/2qrk9d31HC
— Sakshi (@sakshinews) March 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)