Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తెలుగు స్క్రీన్ రైటర్, నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన పోసాని కృష్ణ మురళిని మార్చి 13 వరకు 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. పోసానిని ఇటీవల హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు ఇవాళ పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు.పోసానిని ఈరోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో రాజంపేట జైలులో ఉన్న పోసానిపై ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో మరో కేసు నమోదైంది. ఈసారి చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Mar 03, 2025 10:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).