Nizamabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో.. నిజామాబాద్ జిల్లాలో ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మహిళలు దుర్మరణం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ సమీపంలో జాతీయ రహదారిపై (NH-44) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర దుర్ఘటనలో బస్సు పక్కనే కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Nizamabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో.. నిజామాబాద్ జిల్లాలో ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మహిళలు దుర్మరణం
Nizamabad Road Accident (Photo-Video Grab)

Nizamabad Road Accident: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ సమీపంలో జాతీయ రహదారిపై (NH-44) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర దుర్ఘటనలో బస్సు పక్కనే కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై వెళ్తుండగా గోవింద్ పేట్ ఫ్లైఓవర్ సమీపంలో టైర్ పంచర్ అయింది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సు మరమ్మతులు జరుగుతుండటంతో కొందరు ప్రయాణికులు కిందకు దిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు సమీపంలోనే కూర్చున్నారు.

వీడియో ఇదిగో.. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధుల్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య.. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..

అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో, పక్కనే కూర్చున్న ఇద్దరు మహిళలపైకి బస్సు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Nizamabad Road Accident:

ప్రమాద శబ్దం విన్న స్థానికులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 13, 2026 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).