Posani krishna Murali (Photo-Video Grab)

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది. ఇక తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. ఏపీ సీఐడీ కేసులో స్టే, 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు కేసు ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం

రిమాండ్‌ మీద ఆయన్ని రాజంపేట సబ్‌ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్‌ సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.