Vij, Jan 25: రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy). ఆయన రాజీనామాను అమోదిస్తూ బులిటెన్ కూడా విడుదలైంది. ఎంపీ పదవికి రాజీనామాతో పాటు రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు విజయసాయి. ఈ విషయంపై జగన్(Jagan)తో చర్చించానని వెల్లడించారు.
ఇక విజయసాయి రాజీనామాపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu On Vijayasai Resignation). నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణమాలు జరుగుతుంటాయని.. ఏదేమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అన్నారు. అయితే విజయసాయి రాజీనామా వైసీపీలో పరిస్థితికి అద్దంపడుతుందని విమర్శించారు. జగన్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం
దావోస్(Davos) పర్యటన ముగించుకున్న అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆహ్వానించానని, ప్రస్తుతం తెలుగువాళ్లు ప్రపంచం మొత్తం వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
భారత్‌కు ప్రపంచంలో బంగారు భవిష్యత్తు ఉన్నట్లు తనకు నమ్మకం ఉందని తెలిపారు. 2028 నాటికి జీడీపీ వృద్ధిలో చైనాను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.