Vij, Feb 6: సీఎం చంద్రబాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan Slams Chandrababu). వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్.. బాబు ష్యూరిటీ అంటే మోసానికి గ్యారంటీ? అని చురకలు అంటించారు.
చంద్రబాబు(CM Chandrababu) మోసం చేస్తాడని ఏపీ ప్రజలకు చెప్పానని.. కానీ ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ ను మించిపోయి చంద్రబాబు నటిస్తున్నాడని.. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారన్నారు.
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. రూ,1.40 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ప్రజలకు మేలు చేయలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు (Welfare schemes)ఆగిపోయాయని, ప్రజలు మోసపోయారని అన్నారు. ఇది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిది నెలల్లో వేల కోట్లు అప్పులు చేసి, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే
హామీలు అమలు చేయాలని అడిగితే.. సంపాదించే మార్గాలు ఉంటే చంద్రబాబు నా చెవిలో చెప్పాలని వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ తల్లులకు ఇచ్చిన అమ్మఒడి పోయే.. వసతి దీవెన పోయే.. మిగతా ఇస్తున్న పథకాలు అరకొరే అంటూ ఫైర్ అయ్యారు.
సంపద సృష్టిస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు .. ఇలాంటి మాటలు నమ్మి మా జీవితాలు నాశనం అయిపోయాయి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ష్యూరిటీ మాత్రం ఇస్తాడు.. కానీ గెలిచాక పథకాల అమలుకి గ్యారెంటీ మాత్రం ఉండదు అని దుయ్యబట్టారు.