AP Cabinet Approves Amendments to MSME Policy(X)

Vij, Feb 6:  ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్(AP Cabinet meet). ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీకి అమోదం తెలిపారు(AP Cabinet Decisions). ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం.

అలాగే నామినేటెడ్ పోస్టుల్లో(AP Nominated Posts) బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కీలక పదవులు వచ్చే అవకాశం ఉంది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది.  మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ 

పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరిగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రతిపాదనలు వచ్చాయి. ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేయనున్న నేపథ్యంలో కేబినెట్‌లో దీనిపై కూడా చర్చ జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా చర్చించింది కేబినెట్.