Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి(Fire Accident At YS Jagan House). వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది.
మాజీ సీఎం జగన్(YS Jagan)కు ఇంటి వద్ద భత్రం లోపం? స్పష్టంగా కనిపించిందని మండిపడ్డారు వైసీపీ నాయకులు. బుధవారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నాయకులు(YSRCP), కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని పోస్టులో వెల్లడించగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..
మరోవైపు ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు జగన్. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనుండగా జగన్ ఏం చెబుతారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Fire Accident At YS Jagan House
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 06, 2025 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

