Delhi, January 25: నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన విజయసాయి రెడ్డి.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను అన్నారు. రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి(Jagan) అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ తగ్గదు అన్నారు. రాజీనామా చేయొద్దు, మేము, పార్టీ అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. రాజీనామా అంశం సరికాదు, పునరాలోచించాలని జగన్ సూచించారు అన్నారు. నా రాజీనామా కూటమి కే లబ్ది..నా ప్రాతినిధ్యాన్ని ఎవరు తక్కువ చేయలేరు అన్నారు.
వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా అన్నారు. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించా..రాజకీయాలనుంచి తప్పుకున్నా, ఇక రాజకీయాల గురించి మాట్లాడను అన్నారు. తాను ఏరోజు అబద్దాలు చెప్పలేదు.. నాలుగు దశాబ్దాలుగా జగన్ తో, ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నారు.
ఆయనతో ఎప్పుడూ విభేదాలు లేవు, భవిష్యత్ లో రావు అన్నారు. అప్రూవర్ గా మారాలని ఎన్నో ఒత్తిడులు వచ్చిన నేను తలవంచలేదు, అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఎదురైయ్యాయి...అయిన నేను జగన్ కు నమ్మకద్రోహం చేయను అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై కేసు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు.విక్రాంత్ రెడ్డి ని నేను పంపించలేదు, కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు అన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
విక్రాంత్ రెడ్డి ని కేవీ రావు(KV Rao) కు నేను పరిచయం చేయలేదు.. నాకు వ్యాపారాలు లేవు, దేనిలో నేను భాగస్వామిని కాదు అన్నారు. వ్యాపార లావాదేవీలు నాతో నా వియ్యంకుడు ఎప్పుడు చర్చించరు, వారి వ్యాపారాల గురించి నాకు తెలియదు.రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను బలహీనుడిగా మారుతాను, నన్ను ఎందుకు కేసుల నుంచి తప్పిస్తారు? అన్నారు.
రాజకీయాల్లో నా పాత్రకు న్యాయం చేయలేను అనే రాజకీయలనుంచి దూరం అవుతున్నా.. కేసులకు భయపడే తత్వం నాది కాదు, దేన్నైనా దైర్యంగా ఎదుర్కుంటా అన్నారు. గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరిదగ్గర హామీ తీసుకోలేదు.. బెంగళూరు, విజయవాడలో ఒక ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్ ఇవే నా ఆస్తులు అన్నారు. నీతిగా, నిజాయితీ గా బతకాలని అనుకున్నా, కొన్ని ఛానెల్స్ నాపై అవినీతిపరుడనే ఆరోపణలు చేశాయి.. ఛానెల్ పెట్టె అంశంపై పునరాలోచన చేస్తానన్నారు.