రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఈ మేరకు ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ చైర్మన్(Rajya Sabha)ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి. మరో రెండు రోజుల్లో విదేశాలకు వెళ్లనున్నారు.
ఎవరూ ఉహించని విధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు
వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు. వ్యవసాయం చేసుకుంటానంటూ తెలిపిన విజయసాయి... జగన్(Jagan)కు మంచే జరగాలని కోరుకున్నారు.
ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు అని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని తెలిపారు విజయసాయి రెడ్డి. జగన్ కి షాకిచ్చిన సైరా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ అధినేత గురించి ఏమన్నారంటే..
Vijayasai Reddy meets Rajya Sabha Chairman
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి
రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చిన విజయసాయిరెడ్డి pic.twitter.com/jgdllrYIra
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)