తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్‌ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..

వైఎస్‌ జగన్‌కు పీఠాధిపతులు శ్రీ డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్‌, సండూర్‌) ఆహ్వానపత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంఎల్‌సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, రామచైతన్య (ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌), వీరేష్‌ ఆచార్య (కో-ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌) పాల్గొన్నారు.

Nandipura Peetadhipathis Meet Jagan:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)