దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్. ఏపీ సీఐడీ కేసులో స్టే విధించింది న్యాయస్థానం(Relief For RGV). తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. 2019లో విడుదలైన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై 2024లో కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను సినిమాలో దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు(Ram Gopal Varma ). అయితే రాజకీయ దురుద్దేశంతో తనపై నమోదైన పిటిషన్‌ను కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ.
2019 లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకాలం ఏం చేశారని ... ఇప్పుడు ఫిర్యాదుచేయడం, దానిపై కేసు నమోదు చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ఆర్జీవీపై కేసుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు
రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు
సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు
విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు… pic.twitter.com/t7F4vCeKcW
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)