Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్
Ongole Police Notices issued to Ram Gopal Varma(X)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వాట్సప్‌కి నోటీసు పంపారు రూరల్ సీఐ శ్రీకాంత్.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి 'ఎక్స్'లో పోస్ట్ చేశారు వర్మ(RGV). గతేడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఇక ఇప్పటికే  దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే.  చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. చెక్ బౌన్స్ కేసులో ముంబై లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చే తీర్పునిచ్చింది.  దర్శకుడు ఆర్జీవీకి షాక్.. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష విధించిన అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు

Ongole Police Notices issued to Ram Gopal Varma

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 09:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).