దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఐ లవ్ ఒంగోల్(Ongole).. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్.. 3 ఛీర్స్ అంటూ.. పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు రాంగోపాల్ వర్మ. 9గంటల విచారణ తర్వాత వచ్చి.. మందు తాగుతున్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇదిగో, కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసు, ఒంగోలు పోలీస్ స్టేష‌న్‌లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వ‌ర్మ

మరోవైపు కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఈరోజు ఆర్‌జీవీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. న్యాయ‌వాది స‌మ‌క్షంలో వ‌ర్మ విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

 Director Ram Gopal Varma controversial tweet on ongole police station

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)