కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఈరోజు ఆర్‌జీవీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. న్యాయ‌వాది స‌మ‌క్షంలో వ‌ర్మ విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూ సూద్ .. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం, కంగారు పడవద్దని అభిమానులకు విజ్ఞప్తి

కాగా, పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డానికి ముందు రామ్ గోపాల్ వ‌ర్మను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి క‌లిశారు. ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం వెల్లంప‌ల్లిలోని ఓ హోట‌ల్‌లో వీరిద్ద‌రూ క‌లిసి మంత‌నాలు జ‌రిపారు. రాంగోపాల్ వర్మకు మద్దతుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బుచ్చెపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మరియు ఇతర వైఎస్సార్సీపీ నేతలు వెళ్ళారు.

Director Ram Gopal Varma attends police interrogation in Ongole

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)