ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం RC16. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు దర్శకుడు బుచ్చిబాబు.

ఈ పోస్టర్‌లో జాన్వీక‌పూర్ కుడి చేత్తో మేక‌పిల్ల‌ను ఎత్తుకోగా, ఎడ‌మ చేత్తో గ‌డ్డి మొక్క‌ను ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తోంది(RC16 movie team). ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ను పోషిస్తుండగా ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. ఏపీ సీఐడీ కేసులో స్టే, 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు కేసు ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం 

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

RC16 movie team, Birthday wishes to Janhvi Kapoor

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)