టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కల్పన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. . నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు తలుపులు పగలుగొట్టి చూడగా ఆమెకు నిద్రమాత్రలు మింగినట్లు గమనించారు. దాంతో ఆమెను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Popular singer Kalpana attempts suicide..
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పన. pic.twitter.com/zjMSyY4KxQ
— ChotaNews App (@ChotaNewsApp) March 4, 2025
హైదరాబాద్‌లో ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కల్పన
తలుపులు పగులగొట్టి ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు
రెండు రోజులుగా డోర్ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు#SingerKalpana #LatestNews #RTV pic.twitter.com/5Ne5KnBx23
— RTV (@RTVnewsnetwork) March 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)