Assam Honey Trap Case: 10 నిమిషాల సుఖం కోసం ఆశపడి రూ. 3 లక్షలు పోగొట్టుకున్న బ్యాంక్ మేనేజర్.. అతడిని రూంలోకి పిలిచి మహిళ ఏం చేసిందంటే..
Assam Honey Trap Case: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి వెళ్లిన ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ హనీట్రాప్ (Extortion Trap) వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన అస్సాంలో వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని జోర్హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Assam Honey Trap Case: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి వెళ్లిన ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ హనీట్రాప్ (Extortion Trap) వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన అస్సాంలో వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని జోర్హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని టిన్సుకియాకు చెందిన ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌కు జూలై నెలలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జోర్హాట్‌కు చెందిన మొరోమి దాస్ నియోగ్ అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయంతో ఆగస్ట్ 14న అతడిని జోర్హాట్‌కు రమ్మని ఆమె ఆహ్వానించింది. దీంతో అర్ధరాత్రి వేళ అక్కడకు చేరుకున్న బ్యాంక్ మేనేజర్‌ను ఆ మహిళ సియోని అలీ ప్రాంతంలోని ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లింది. వారిద్దరూ గదిలో ఉండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు వ్యక్తులు తలుపు తట్టి లోపలికి ప్రవేశించారు. ఏలూరులో దారుణం.. నా భర్త మగాడు కాదు.. సంతానం కోసం స్నేహితుడితో పడుకోవాలని వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన భార్య..
గదిలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను విచక్షణారహితంగా భయభ్రాంతులకు గురిచేస్తూ.. సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించి తొలి విడతగా రూ.2 లక్షలు, ఆ తర్వాత మరో రూ.1 లక్ష బలవంతంగా వసూలు చేశారు. అంతటితో ఆగకుండా బాధితుడిని మరో రూ.5 లక్షలు ఇవ్వాలని పదేపదే బ్లాక్‌మెయిల్ చేయడంతో.. తాళలేక అతడు అక్టోబర్ 2న జోర్హాట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాల ఆధారంగా మొదట గర్ముర్ ప్రాంతానికి చెందిన సంజీబ్ దాస్, అంకిత్ పాల్‌లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మొరోమి దాస్ నియోగ్ అని తేలింది. పరారీలో ఉన్న ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని దిబ్రుగఢ్‌కు పంపి, పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఈ నేరంలో భాగస్వాములైన బేబీ బోరా, ఆమె భర్త అంకిత్ బోరాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్తలు, బ్యాంకర్లు మరియు ఆర్థికంగా స్థిరపడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Oct 09, 2026 04:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

