Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం.. నా భర్త మగాడు కాదు.. సంతానం కోసం స్నేహితుడితో పడుకోవాలని వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన భార్య..
ఏలూరులో దాంపత్య జీవితానికి సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన భర్తకు ఉన్న శారీరక సమస్యను దాచిపెట్టి వివాహం చేసుకున్నారని, అనంతరం సంతానం కోసం తన భర్త స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఓ 21 ఏళ్ల యువతి ఆరోపించింది.
Andhra Pradesh Shocker: ఏలూరులో దాంపత్య జీవితానికి సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన భర్తకు ఉన్న శారీరక సమస్యను దాచిపెట్టి వివాహం చేసుకున్నారని, అనంతరం సంతానం కోసం తన భర్త స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఓ 21 ఏళ్ల యువతి ఆరోపించింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో భర్త తనను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. భర్తతో పాటు అత్తమామలు కూడా తనను తీవ్రంగా మానసికంగా వేధించారని ఆరోపిస్తూ ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరోసారి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు పవర్‌పేటలోని వాసుదేవాలయం సమీపంలో నివసించే యువతికి తెనాలికి చెందిన దిలీప్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో యువతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 15 కాసుల బంగారం, కిలోన్నర వెండి వస్తువులతో పాటు వివాహ ఖర్చుల కోసం రూ.5 లక్షల నగదు ఇచ్చారని, మొత్తం వివాహానికి దాదాపు రూ.13 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అయితే పెళ్లయిన నాటి నుంచే దిలీప్ భార్యతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నాడని యువతి ఆరోపించింది.
భర్తకు ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించినట్లు తెలిపింది. చికిత్స చేయించడంతో పాటు మందులు వాడటం, ఆపరేషన్ చేయించుకోవడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొంది. ఈ విషయాన్ని భర్త కుటుంబ సభ్యులు ముందుగానే తనకు తెలియజేయలేదని ఆమె ఆరోపించింది. కొంతకాలం తర్వాత సంతానం విషయంలో తనపై ఒత్తిడి మరింత పెరిగిందని తెలిపింది.
ఈ క్రమంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో భర్తతో కలిసి ఉన్న సమయంలో దిలీప్ తన స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుంటే సంతానం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి తనను ఒప్పించేందుకు ప్రయత్నించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే భర్త చెప్పిన ప్రతిపాదనకు ఆమె తీవ్రంగా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన దిలీప్ తనపై దాడికి పాల్పడ్డాడని, దిండును ముఖంపై బలంగా అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. ఆ సమయంలో తాను తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపింది.
ఇదే సమయంలో భర్తకు అనుకూలంగా వ్యవహరించిన అత్తమామలు కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చారని యువతి పేర్కొంది. భర్త చెప్పినట్లు వినాలని, కుటుంబానికి వారసుడు కావాలంటే అతని సూచనకు అంగీకరించాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. అంతేకాకుండా భర్త నుంచి విడిపోవాలనుకుంటే అదనంగా డబ్బులు తీసుకురావాలని అత్తింటివారు డిమాండ్ చేశారని ఫిర్యాదులో తెలిపింది.
అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఏలూరుకు తిరిగి వచ్చి మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. అప్పట్లో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తింటివారు ఇచ్చిన హామీలను నమ్మిన యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
కుటుంబ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకునేందుకు యువతి తన బంధువులతో కలిసి తెనాలిలోని అత్తింటికి వెళ్లింది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమెకు ఎవరూ కనిపించలేదు. భర్త, అత్తమామలకు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని తెలిపింది. దీంతో మరోసారి ఏలూరు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 08, 2026 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

