మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ శ్రీలీల‌ను స‌త్క‌రించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం చిరు నటిస్తున్న విశ్వంభర మూవీ చిత్రీకరణ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరుగుతుంది. ఇందులో శ్రీలీల కూడా నటిస్తుండగా మహిళా దినోత్సవం సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్.

శ్రీలీలని శాలువాతో సత్కరించి.. దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని ప్రత్యేకంగా తెప్పించి ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చారు(Actress Sreeleela). ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది శ్రీలీల. చిరంజీవితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. `ఓజీ`తో. నా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌. ఆయనొక సినిమా వేడుక. ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి నుంచి స్వీట్‌ గెస్చర్‌ అని పేర్కొంది.

రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Megastar Chiranjeevi Felicitates Actress Sreeleela on the Occasion of Women's Day

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)