Vij, Jul 18: ఏపీలో తిరుగులేని మెజార్టీతో టీడీపీ - జనసేన - వైసీపీ - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించారు పవన్. అందుకే చంద్రబాబు తన కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పవన్‌కు అవకాశం కల్పించడమే కాదు మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఇక పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి కింగ్ మేకర్‌గా మారిన పవన్...జనసేన పార్టీ విస్తరణపై దృష్టి సారించారు.
నేటి నుండి పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని జనసేన నేతలు వెల్లడించారు. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యుల్ కార్యక్రమం ఈ పదిరోజుల్లో చేపడతామని తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ (Gadchiroli Encounter) జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు (12 Maoist dead) అధికారులు వెల్లడించారు.
జనసేన క్రియాశీలక సభ్యులకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని...సభ్వత్వం తీసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50 వేల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జనసైనికుడికి, వీర మహిళకి భరోసా కల్పించడమే ధ్యేయమని పార్టీ నేతలు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనసేన క్రియాశీలక సభ్యులు 6.47 లక్షల మంది ఉండగా ఈసారి 9 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. పార్టీ నేతలంతా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వార్డులు, గ్రామాల వారీగా చేరికలపై దృష్టి సారించాలని సూచించారు జనసేనాని పవన్.