Gadchiroli, July 17: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ (Gadchiroli Encounter) జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు (12 Maoist dead) అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో ఉదయం 10గంటల సమయంలో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య మధ్యాహ్నం మొదలైన భీకర కాల్పులు (Encounter) సాయంత్రం వరకు కొనసాగాయని పోలీసు అధికారులు తెలిపారు.
#UPDATE | A heavy exchange of fire started in the afternoon and continued intermittently till late evening for more than 6 hours. Area search has led to recovery of 12 Maoist dead bodies till now. 7 automotive weapons including 3 AK47, 2 INSAS, 1 carbine, 1 SLR have been…
— ANI (@ANI) July 17, 2024
దాదాపు ఆరు గంటల పాటు కాల్పులు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్ గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం నాగ్‌పుర్‌కు తరలించారు.