Vij, July 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 22(రేపటి) నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తి జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు.
టీడీపీ నుండి నామినేటెడ్ పదవులు ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా జనసేన నుండి కొద్దిమంది పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా మెగాబ్రదర్ నాగబాబు పేరు ప్రచారం జరుగుతోంది. ఇక తన కుటుంబం నుండి ఎవరికి పదవులు ఉండవని పవన్ ప్రకటించిన ప్రచారం మాత్రం ఆగడం లేదు.
ఈ నేపథ్యంలో స్వయంగా స్పందించారు నాగబాబు. తనకు పదవులపై కోరిక లేదని స్పష్టం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తలు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలను అందజేశారు.
అనంతరం మాట్లాడిన నాగబాబు...పదవులపై తనకు కోరిక లేదని, పవన్ ఆశయాలను నిలబెట్టేందుకే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. తనకు ఓపిక ఉన్నంత వరకు పార్టీకోసం పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు సాయం చేస్తూ వస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందని..చంద్రబాబు, పవన్ ఇద్దరి సారథ్యంలో ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందన్నారు.
గత ఐదేళ్లలో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతామని , ఏపీలోరాష్ట్రపతి పాలన అడగడానికి జగన్‌కు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో జరిగిన అవినీతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక,ఆందోళనలో జనసైనికులు