Pawan Kalyan(Twitter)

Vij, July 16: ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓట్లు చీలకకుండా తన పార్టీకి నష్టం జరిగిన కేవలం 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు పవన్. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందగా చంద్రబాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు పవన్.

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించాయి కేంద్ర నిఘా వర్గాలు. పవన్ కళ్యాణ్ జాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉందని, కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావన వచ్చిందని వెల్లడించింది. ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు చెప్పలేము అని తెలిపాయి నిఘా వర్గాలు. ఇక పవన్‌ భద్రతకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు కీలక సూచన చేసిన నేపథ్యంలో జనసైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వాస్తవానికి పవన్‌ భద్రతకు ముప్పు ఉన్న నేపథ్యంలో గత డిసెంబర్‌లోనే ఆయనకు భద్రతను పెంచారు. తాజాగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో భద్రతను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్

Here's Tweet: