Bengaluru, Mar 5: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు, నిందితుడు హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని వారు ఈ మెయిల్‌లో హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు.