KTR Condemns the attack on Yadadri BRS Party office(X)

Hyd, January 11:  బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడికి పాల్పడ్డారు. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి, పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచల్.... వీడియో ఇదిగో

జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఎన్నుకున్న ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అన్నారు కేటీఆర్.

KTR Condemns the attack on Yadadri BRS Party office

పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటోందన్నారు. మా పార్టీ కార్యకర్తల, నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం అని...వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.