Hyderabad Horror: డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్.. నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడి దుర్మణం.. పటాన్ చెరులో ఘటన
గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పై పడ్డాడు.
Hyderabad, Dec 9: గ్రిల్స్ (Grills) తెరిచి ఉండటంతో లిఫ్ట్ (Lift) వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్ (Delivery Boy). దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పై పడ్డాడు. అయితే, ఇదే సమయంలో లిఫ్ట్ పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. హైదరాబాద్ శివారుల్లోని పటాన్ చెరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడిని జేమ్స్(38)గా గుర్తించారు.
అలా వెలుగులోకి
లిఫ్ట్ మూడో అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్.. జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Dec 09, 2023 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

