Free Bus Travel for Women in Telangana: నేటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి పథకం ప్రారంభం.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో సౌకర్యం అందుబాటులోకి
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది.
Hyderabad, Dec 9: బాలికలు (Girls), మహిళలు (Women), ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో (RTC Buses) ఉచిత ప్రయాణం (Free Travel) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి దీనిని అమలులోకి తేనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సులో ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
బస్సుల పెంపు కూడా
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చునని సజ్జనార్ చెప్పారు. మహిళలకు ప్రయాణం సమయంలో జీరో టిక్కెట్ ఇస్తామన్నారు. ఐదారు రోజుల తర్వాత జీరో టిక్కెట్ ప్రింటింగ్ చేస్తామన్నారు. కొన్ని రోజుల సమీక్ష అనంతరం బస్సులు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు.
(The above story first appeared on LatestLY on Dec 09, 2023 08:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

