తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
సీనియారిటీ ప్రకారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఇవాళ ఆయన కాలు జారిపడటంతో గాయాలయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండగా, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో రేవంత్ సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ వినతిని అక్బరుద్దీన్ స్వీకరించారు.
Here's ANI Tweet
AIMIM MLA Akbaruddin Owaisi appointed as Pro-tem Speaker of Telangana Legislative Assembly pic.twitter.com/1CGFfyw7S2
— ANI (@ANI) December 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)