భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమేనని తెలిపింది. భర్తకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. తాము 2017లో వివాహం చేసుకున్నామని, ఆమె పోర్న్ సైట్‌లకు బానిస అవడమే కాకుండా తనను శారీరకంగా బలహీనంగా ఉన్నావని, మరొకర్ని పెళ్లి చేసుకుంటానని నసపెట్టేదని భర్త కోర్టు ఎదుట వాపోయాడు.
రూ.6 లక్షల భరణం కోరిన భార్య, మీరే సంపాదించుకోవాలన్న మహిళా జడ్జి
ఈ ఆరోపణలను భార్య ఖండిస్తూ.. తాను పోర్న్ సైట్‌లు చూసేదాన్నని చెప్పడానికి వారు ఎటువంటి ఆధారాలనూ ఇవ్వలేకపోయారని వాదించింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ కేసులో భార్యా భర్తలు గత 6 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. వారి బంధం బాగుచేయలేని స్థాయిలో పాడైపోయింది’ అని వ్యాఖ్యానించింది. కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వుల్లో తప్పుపట్టడానికి ఏమీ లేదని భావిస్తున్నామని, ఆ ఉత్తర్వులను సమర్థిస్తున్నామని తీర్పు వెలువరించింది.