Telangana Teacher Murder Case: ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్‌ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి, వివాహేతర సంబంధం మోజులో భార్య దారుణంగా..

ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండ‌లం ప‌ర్సువాడలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు గ‌జేంద‌ర్‌ ఈ నెల 12న దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు.

Telangana Teacher Murder Case: ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్‌ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి, వివాహేతర సంబంధం మోజులో భార్య దారుణంగా..
Telangana Teacher Murder Case

ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండ‌లం ప‌ర్సువాడలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు గ‌జేంద‌ర్‌ ఈ నెల 12న దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జైన‌థ్ మండ‌లం కెనాల్ మేడిగూడ‌లో టీచ‌ర్‌గా గ‌జేంద‌ర్ ప‌ని చేస్తున్నారు. మృతుడి స్వ‌స్థ‌లం నార్నూర్ మండ‌లం నాగుల‌కొండ‌.  హైదరాబాద్‌లో దారుణం, బాలికను రేప్ చేసి ఆపై కాల్చి చంపేసిన కామాంధులు, పురుగులు పట్టిన స్థితిలో ఉన్న కూతురు మృతదేహాన్ని తండ్రి చూసి..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. మృతుడి భార్య విజయలక్ష్మి.. మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కొన్ని ఫోటోలను పోలీసులు గుర్తించారు. ప్రియుడి కోసమే భార్య విజయలక్ష్మి సుపారీ గ్యాంగ్‌తో పోన్లో‌ మాట్లాడి భర్తను హత్య చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Here's Video and Pics

అయితే రిమాండ్లో ఉన్న భార్య విజయలక్ష్మి బ్లేడ్ ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మాయమాటలు చెప్పింది. దీంతో ఆమెను రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను పరీక్షించిన వైద్యులు ఎలాంటి బ్లేడ్ ముక్కలు లేవని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jun 17, 2024 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).