Telangana Horror: హైదరాబాద్‌లో దారుణం, బాలికను రేప్ చేసి ఆపై కాల్చి చంపేసిన కామాంధులు, పురుగులు పట్టిన స్థితిలో ఉన్న కూతురు మృతదేహాన్ని తండ్రి చూసి..
కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. సగం కాలిన మృతదేహం పురుగులు పట్టిన స్థితిలో కనిపించడం చూసేవారికి కన్నీళ్లు పెట్టిస్తోంది.
Hyd, June 17: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి, మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేశారు. కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. సగం కాలిన మృతదేహం పురుగులు పట్టిన స్థితిలో కనిపించడం చూసేవారికి కన్నీళ్లు పెట్టిస్తోంది.
విషాదకర ఘటన వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం బతుకుదెరువు కోసం హైదారాబాద్ కు వలస వచ్చింది. ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపిస్తూ తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళుతున్నారు. ఈ నెల 7న కిరాణా షాపుకు వెళ్లిన తన పెద్ద కుమార్తె (12) ఇంటికి తిరిగిరాలేదని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తండ్రి చెప్పాడు. అయితే, పోలీసులు తమను పట్టించుకోలేదని, తన కూతురు కోసం వెతకడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించాడు. దారుణం, ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ళ బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం, అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారం రోజుల తర్వాత తాము ఉంటున్న వీధిలో చెత్తకుప్పలో తన కూతురు మృతదేహం కనిపించిందన్నారు. సగం శరీరం కాలిపోయి, పురుగులు పట్టిన స్థితిలో తన కూతురును చూడలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే, ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేవంటూ చెప్పి, పోలీసులు తేలిగ్గా వదిలించుకున్నారని మండిపడ్డాడు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తమ కూతురు తమకు దక్కేదని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు
(The above story first appeared on LatestLY on Jun 17, 2024 01:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

