
New Delhi, FEB 19: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్‌లోకి (Tesla in India) ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), టెస్లా సీఈవో ఎలాన్ (Elon Musk) మధ్య ఇటీవల సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత కంపెనీ కీలకమైన చర్యలు తీసుకుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రధానితో భేటీ తర్వాతి రోజే టెస్లా భారత్‌లో ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు పలు నివేదికలు తెలిపాయి. టెస్లా కంపెనీ భారత్‌లోని పలు నగరాల్లో షోరూమ్‌లను (Tesla Showrooms in India) తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్‌లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది.
Tesla Re-Entry: ప్రధాని మోదీతో మస్క్ భేటీ ఎఫెక్ట్.. భారత్ లో టెస్లా ఉద్యోగ నియామకాలు ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్‌లో ప్రవేశించేందుకు తాజాగా ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేసింది. వాస్తవానికి గతంలో దిగుమతి సుంకాల నేపథ్యంలో భారత్‌లో ఎంట్రీ ప్రణాళికలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. టెస్లా తొలి షోరూమ్‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ కంపెనీల హోటల్స్, రిటైల్ షాప్స్, కార్యాలయాలకు దగ్గరగా ఉన్నందున.. టెస్లా ఏరోసిటీనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ముంబయిలో టెస్లా తన షోరూమ్‌ను బంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)కు, ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోనే ఉండనున్నది. ఇక ఢిల్లీ, ముంబయి షోరూమ్స్ దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నాయి. షోరూమ్‌ల ప్రారంభ తేదీలు ఖరారు కాలేదని తెలుస్తున్నది. టెస్లా ప్రారంభంలోనే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తుంది. ఆ తర్వాత స్థానికంగా అసెంబ్లీ పాయింట్ లేదంటే.. ప్లాన్‌ను నెలకొల్పే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.
భారత్‌లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో టెస్లా కంపెనీ మోడల్-3, మోడల్-ఎస్, మోడల్-వై వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను విక్రయించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. టెస్లా ఇటీవల భారత్‌లో ఉద్యోగుల నియామకం కోసం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్‌లో 13 ప్లేసెస్ కోసం కంపెనీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో కస్టమర్ సర్వీస్, బ్యాక్-ఎండ్ ఆపరేషన్స్, తదితర రోల్స్‌కు సంబంధించి నియామకాలు చేపట్టనున్నది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.