Elon Musk Meets PM Modi (PIC@ Twitter)

Newdelhi, Feb 18: ఎలక్ట్రిక్ కార్ల  దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. భారత్ లోని ముంబై (Mumbai), ఢిల్లీలో (Delhi) తమ కంపెనీలో పనిచేసేందుకు గానూ 13 స్థానాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ను టెస్లా వెలువరించింది. ఈ సంవత్సరమే దేశంలో రిటైల్ సేల్స్ ను కూడా సంస్థ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదే జరిగితే, తక్కువ ధరకు టెస్లా కార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా 2021 నుంచి  భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు టెస్లా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, సుంకాలు, ఇతరత్రా కారణాలతో ఆ ప్రణాళికలు ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.

తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!

ఆ భేటీ కారణంగానే?

గతవారం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మస్క్ తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌ లో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ భారత్‌ లో టెస్లా ఎంట్రీ, స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ జరిగిన కొద్దిరోజులకే టెస్లా ఉద్యోగ ప్రకటన చేయడం గమనార్హం.

రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!