
Newyork, Feb 18: ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు (Plane Accidents) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్ కు (Delta Airlines) చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం తలకిందులుగా తిరగబడింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బలమైన గాలులే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు, విమానం తిరగబడే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి పలువురిని గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
Here's Video:
🚨JUST ANNOUNCED: Delta Airlines plane crashes at Pearson International Airport, Toronto, Canada on #PresidentsDay #Toronto pic.twitter.com/rNfYgdCaZ6
— AJ Huber (@Huberton) February 17, 2025
అమెరికాలో మూడు వారాల్లో నాలుగు ప్రమాదాలు
కెనడాపొరుగుదేశం అమెరికాలోనూ ఇటీవల వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన మూడు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు. రెండు రోజుల తర్వాత (జనవరి 31న) ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 11న రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పి ఒకరు మరణించారు. గత మూడు వారాల్లో అమెరికాలో నాలుగు విమాన ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది చనిపోయారు.