TGSRTC Board takes key decision new bus depos and bus stands(X)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు https://tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

విశాఖలో మళ్లీ పడగవిప్పిన ర్యాగింగ్ భూతం, దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్లను వేధించిన సీనియర్లు, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట

ప్రస్తుతం ఈ ప్రత్యేక రాయితీ హైదరాబాద్-బెంగళూరు మార్గానికే పరిమితంగా ఉన్నప్పటికీ, ఇతర ముఖ్యమైన మార్గాల్లోనూ దీన్ని అమలు చేయాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వి.సి. సజ్జనార్ ఈ రాయితీ ప్రకటనను ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రకటించగా, అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ రాయితీ ప్రయోజనాన్ని ప్రయాణికులు వినియోగించుకుని ప్రయాణ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.