Viral Video: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు ఆగమన్నందుకు డాక్టర్‌పై స్టూల్‌తో దాడి.. బీపీ చెక్ చేయకుండానే తేలిపోయిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వైరల్ వీడియో ఇదిగో..

Viral Video: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు ఆగమన్నందుకు డాక్టర్‌పై స్టూల్‌తో దాడి.. బీపీ చెక్ చేయకుండానే తేలిపోయిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వైరల్ వీడియో ఇదిగో..
Patient Attacks Doctor After Being Asked to Wait 10 Minutes for BP Check

వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఒక రోగి సహనం కోల్పోయి డాక్టర్‌పై భౌతిక దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. బీపీ (రక్తపోటు) పరీక్షించే ముందు ఒక పది నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలని వైద్యుడు సూచించడమే ఆ రోగి ఆగ్రహానికి కారణమైంది.

వైద్యుడి రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ప్రకారం.. బీపీ చెక్ చేసుకోవడానికి వచ్చిన రోగితో డాక్టర్ మాట్లాడుతుండగా.. పది నిమిషాలు వేచి ఉండాలని డాక్టర్ చెప్పారు. దీనికి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి పక్కనే ఉన్న బరువైన చెక్క స్టూల్‌ను తీసుకుని వైద్యుడి తలపై బలంగా కొట్టాడు. హఠాత్తుగా జరిగిన ఈ దాడితో డాక్టర్ ఒక్కసారిగా షాకయ్యాడు.. దెబ్బ గట్టిగా తగలడంతో అల్లాడిపోయారు.

ముంబై లోకల్ రైలులో షాకింగ్ ఘటన.. ప్రయాణికుడిపై ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు దాడి.. వీడియో వైరల్ కావడంతో ఇద్దరు అరెస్ట్..

దాడి నుంచి తన్ను తాను కాపాడుకునేందుకు ఆ స్టూల్‌ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగిందనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.అతడికి బీపీ ఎంత ఎక్కువగా ఉందో కొలవడానికి ఏ పరికరమూ అవసరం లేదు.. తనే నిరూపించుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Patient Attacks Doctor After Being Asked to Wait 10 Minutes for BP Check

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 03, 2026 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).