Big alert for Tirumala devotess, who is going to Tirumala!(X)

Tirumala, Feb 18: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD Tickets) సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీ డిప్‌ విధానంలో కేటాయించే ఆర్జిత సేవతోపాటు ఈనెల 24వరకు జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయన్నుట్టు టీటీడీ వెల్లడించింది. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం  ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తోంది. సుప్రభాతం, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌ లైన్‌ లో రిజిస్టర్ చేసుకుని చెల్లింపులు మాత్రం 22 వరకూ చేయవచ్చు. ఆ తరువాతే లక్కీ డిప్ ద్వారా టికెట్లు మంజూరు అవుతాయి.

రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

శ్రీవారి కళ్యాణోత్సవం ఇలా..

తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు ఈ నెల 21 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.  అదే రోజు అంటే ఫిబ్రవరి 21 మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్స్ కోటా విడుదల కానుంది. ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 24 మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేస్తారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.  మే నెల వివిధ సేవల టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌ సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ద్వారా తీసుకోవచ్చు.

బంగాళాఖాతంలో దూసుకొస్తున్న తుఫాను, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంతలా ఉంటుందంటే..

తిరుమల మే నెల కోటా ముఖ్యమైన తేదీలు

  • ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
  • ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల నుంచి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ల బుకింగ్
  • ఫిబ్రవరి 20-22 వరకు చెల్లింపులు, లక్కీ డిప్
  • ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు
  • ఫిబ్రవరి 21 మద్యాహ్నం 3 గంటలకు వర్సువల్ సేవలు, దర్శనం స్లాట్స్ బుకింగ్
  • ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలు అంగ ప్రదక్షిణం టోకెన్లు
  • ఫిబ్రవరి 22ఉదయం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
  • ఫిబ్రవరి 24 మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్
  • ఫిబ్రవరి 24 ఉదయం 10  గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు